కల్తీ పాల ఘటన బాధాకరం.. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు
అమరావతి: రాజమండ్రి కల్తీ పాల ఘటన(Rajahmundry Adulterated Milk ) బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) అన్నారు. కల్తీ పాలు తాగి నలుగురు చనిపోయారు, ఇద్దరు వెంటిలేటర్ పై ఉన్నారని సూచించారు. మరో ఎనిమిది మందికి చికిత్స జరుగుతోందని చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. కల్తీ పాలతోనే డయాలసిస్ సమస్యలు వచ్చాయని చెప్పారు. కల్తీ పాల బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని సీబీఎస్ హెచ్చరించారు. పాల వ్యాపారి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీకి పాల్పడితే ఎవ్వరినీ వదిలిపెట్టామని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు.
వరలక్ష్మి మిల్క్ డెయిరీ(Varalakshmi Milk Dairy) నుంచి పాలు సరఫరా అయ్యాయి. 106 కుటుంబాలకు పాల సరఫరా జరిగినట్లు అధికారులు గుర్తించారు. కల్తీ పాలతో నలుగురు మరణించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇద్దరు చిన్నారులు వెంటిలెటర్ పై ఉన్నారు. 106 కుటుంబాల నుంచి శాంపిల్స్ సేకరించామని మంత్రి వివరించారు. పాల డెయిరీలో కూడా శాంపిల్స్ సేకరించామన్నారు. కల్తీ పాల ఘటనపై ఏపీ ఆరోగ్య శాఖమంత్రి ప్రకటన చేశారు. పాలు, ఇతర ఆహార పదార్థాలతో అనారోగ్యం పాలయ్యారు.




