19-12-2025 10:00:30 PM
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని తిరుమల్ నగర్ శ్రీ నిలయంలో మయూరగిరి పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నములకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాదేవి లోకానికి అందించిన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తూ ఈ శ్రీ వ్రతాన్ని ఆచరించిన వారికి సుఖసంపదలు సకల సౌభాగ్యాలు కలిగి మనశ్శాంతి ఆరోగ్యం ఉంటుంది.
ప్రజలలో ప్రేమాభిమానాలు పెరుగుతాయని, దుష్ట ప్రవర్తన దూరమవుతుందని, సమాజ శ్రేయస్సు కలుగుతుందని అన్నారు. గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని లోకానికి అందించిందని అన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము భజనలు చేసి తీర్థప్రసాదనాలు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనా పారాయణం, తిరుప్పావై వైభవం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.