19-12-2025 10:07:45 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత భారత్ అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాంతీయ సమన్వయకర్త ఉన్నత భారత్ అభియాన్ డాక్టర్ దేబేంద్ర నాథ్ దాస్ మాట్లాడుతూ... విద్యార్థులు, గ్రామీణ ప్రజలు, అభివృద్ధి మధ్య వారధిగా మారాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధికి జ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి వాటి అమలు (ఎగ్జిక్యూషన్) ఎంతో కీలకమని అన్నారు. అలాగే నైపుణ్యాల వృద్ధి (స్కిల్ ఎన్‌రిచ్‌మెంట్) ద్వారా గ్రామీణ సమస్యలకు పరిష్కారాలు సాధ్యమని, ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు.