22 July, 2026 | 5:59 PM

Breaking News

యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   విజ్ఞాన్ పాఠశాలలో మెహందీ వేడుకలు   •   మరోసారి మూడు నెలలకు రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ   •   SIR ప్రక్రియను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్   •   అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం   •   ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం   •   శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో అమలు చేయాలి   •   త్రాగునీటి వసతి కల్పనతో పాటు పారిశుధ్యం పనుల పరిశీలన   •   కొల్లమద్ది ఎస్సీ కాలనీ షార్ట్ సర్క్యూట్ బాధితులకు అండగా ఉంటాం: పర్శ హన్మాండ్లు   •  

మోదీ హవా తగ్గింది!

07-06-2024 01:18 AM

విదేశీ మీడియా కథనాల్లో విశ్లేషణ

భారత్‌లో ఎన్నికల ఫలితాలపై, బీజేపీకి మెజార్టీ తగ్గడంపై కథనాలు

న్యూఢిల్లీ, జూన్ 6: భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సరళిపై ఈసారి అంతర్జాతీ య మీడియా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇక్కడి ఎన్నికల సరళి, ఫలితాలపై అంతర్జాతీయ మీడియా వరుస కథనాలు ప్రచురించింది. గతంతో పోలిస్తే మోదీ హవా తగ్గిందని విదేశీ మీడియా విశ్లేషించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు అనివార్యంగా మారిందని కథనాలు ప్రచురించింది.  

ది న్యూయార్క్ టైమ్స్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం సాధించలేదని, భాగస్వామ్య పార్టీల మద్దతుతో మోదీ మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్నారంటూ ది వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మోదీ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

టైమ్స్ లండన్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మోదీని, ఆయన పార్టీని షాక్‌కు గురిచేశాయని లండన్‌కు చెందిన టైమ్స్ కథనం పేర్కొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీల మద్దతుపై ఆధారపడాల్సి ఉందని అభిప్రాయపడింది. 

గ్లోబల్ న్యూస్, కెనడా

బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లను కోల్పోయిందని కెనడాకు చెందిన గ్లోబల్ న్యూస్ నివేదిక పేర్కొంది. గతంలో సొంతంగా మెజార్టీ సాధించిన బీజేపీ.. ఇప్పుడు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వచ్చిందని తెలిపింది.

ది డైలీ స్టార్, బంగ్లాదేశ్

ఎన్డీయే ౪ వందలకుపైగా సీట్లు సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదని బంగ్లాదేశ్‌కు చెందిన ది డైలీ స్టార్ కథనం పేర్కొంది.