7 March, 2026 | 8:58 PM

గీర్వాణి విద్యాలయంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

07-03-2026 07:11 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి గీర్వాణి  విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైస్ ప్రిన్సిపాల్ అందుర్తి లత ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటామని,

మహిళలు హక్కులు విజయాలు సాధించుకొని, సమాజాభివృద్ధిలో వారి పాత్రను గుర్తుచేసే రోజని, మహిళలు కళ, సాహిత్యము, రాజకీయ, విద్య, వైద్య అన్ని రంగాలన్నింటిలోనూ  ముందంజ ఉండాలని తెలియజేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు తమ తమ ప్రతిభ ప్రదర్శనలతో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ కోడూరి నాగరాజు, సిరిపురం శ్రీనివాస్, యోగ మాస్టర్ సత్తినేని  శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.