16 March, 2026 | 6:00 PM

విద్యుత్ సరఫరాలో అంతరాయం

16-03-2026 01:05 PM

ఏఈ సంకీర్త్ 

భిక్కనూర్,మార్చి16( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పట్టణ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్ మరమ్మత్తు పనుల కారణంగా మంగళవారం (మార్చి 17) విద్యుత్ సరఫరాకు(Power Supply) అంతరాయం కలుగుతుందని ఏఈ సంకీర్త్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు. వార్షిక లైన్ మెయింటెనెన్స్, సబ్‌స్టేషన్ మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరమ్మత్తు పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తైతే విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తామని ఏ ఈ సంకీర్త్  తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.