08-01-2026 02:51:25 PM
ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, సీతక్క
హనుమకొండ,(విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇనుగాల వెంకటరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గత 15 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన మాజీ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని పలువురు అభినందించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఇనుగాల వెంకటరామిరెడ్డిని శాలువాతో సన్మానించారు. పూల బోకేతో అభినందించారు. అనంతరం నూతన అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమర్థవంతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు.