14 March, 2026 | 3:19 PM

అభివృద్ధి కేరాఫ్ ఉప్పల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

08-01-2026 02:48 PM

ఉప్పల్,విజయక్రాంతి : అధికార హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఏ హోదాలో ఉన్న  తన నియోజకవర్గ  అభివృద్ధి తన లక్ష్యమని  ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నాడు  నాచారం డివిజన్లోని  స్థానిక కార్పొరేటర్ శాంతితో కలిసి 86 లక్షల రూపాయల సిమెంటు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నియోజవర్గ పరిధిలోని  కాలనీలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో  కాలనీలను మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని  తెలంగాణలో అభివృద్ధి కేరాఫ్ ఉప్పల్ నియోజకవర్గం  తీర్చిదిద్దడమే  తన లక్ష్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ప్రజలకు కావలసిన మౌలిక వసతులు రోడ్లు మంచినీరు డ్రైనేజీ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయని ఆయన అన్నారు. రానున్న రోజులలో  సమస్య లేని నియోజకవర్గంగా  ఉప్పల్ నియోజకవర్గం ఉంటుందని  ఆయన పేర్కొన్నారు.

అనంతరం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సాయి నగర్ చౌరస్తా  కాంక్రీట్ పలోజ్  ఈస్ట్ గేటు వరకు 33 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని  అలాగే 53 లక్షల రూపాయలతో రాఘవేంద్ర నగర్ మూడు నాలుగు ఐదు ఏడు  సిమెంట్ రోడ్ నిర్మాణాలను చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆమె తెలిపారు. 

అభివృద్ధి పనుల నిధులు మంజూరు కృషిచేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి  ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ ఈ ఈ రమేష్ బాబు డిఈ ఉమామహేశ్వరి వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్  గ్రేటర్ హైదరాబాద్ బి ఆర్ ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్    సీనియర్ బిఆర్ఎస్ నాయకులు ముత్యంరెడ్డి  కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.