అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ముకరంపుర, జూలై 19(విజయ క్రాంతి): ఎస్సారార్ ప్రభుత్వ ఆరట్స్ & సైన్స్ కళాశాల కరీంనగర్ లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారినుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. కె. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు 4,ఇంగ్లీష్ 5, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐ 1, కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికిషన్ లో 5, బీబీఎ 2, బిజినెస్ ఎనలిటిక్స్ 1, బీకాం ఫైనాన్స్ 1, బీకాం రిటైల్ ఆపరేషన్స్1, డాటా సైన్స్ 1, బీసీఎ 2, ఫిషరీస్ 1, స్టాటిస్టిక్స్ 1, క్రాప్ ప్రొడక్షన్ 1, మైక్రోబయాలజీ 1, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ & మిషన్ లెర్నింగ్ 1, ఎకనామిక్స్ 1, బీఎస్సీ హానర్స్ 2, హెల్త్ కేర్ 1,జువాలజీ 1,ఫుడ్ సైన్స్&క్వాలిటీకంట్రోల్ 1,చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు.కమీషనర్ ప్రొసీడింగ్స్ ఆదేశాలకు లోబడి, పోస్టు గ్రాడ్యూయేషన్లో 55 శాతం మార్కులుండి, నెట్, సెట్, పీహెచ్ డి ,టీచింగ్ లో అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తేదీ 20.జులై.2026 రోజున సాయంత్రం 4.00 గంటల లోపు తమ బయోడేటా తో పాటు దరఖాస్తులను ఎస్సారార్ కళాశాల ఆఫీస్ లో సమర్పించగలరు.ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను తేదీ 22.జూలై.2026 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు, ప్రిన్సిపాల్ ఛాంబర్ లో నిర్వహించబడును.కావున అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.






