డీడీఎన్ రాష్ట్ర కమిటీలో మానుకోటకు పెద్దపీట
మహబూబాబాద్, జులై 19 (విజయక్రాంతి): దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర కమి టీలో మ హబూబాబాద్ జిల్లాకు చెందిన ప లువురికి పదవులు లభించాయి. రా ష్ట్ర కమిటీ విస్తర ణలో భాగంగా రాష్ట్ర కన్వీనర్ గా అనంతాద్రి దేవాలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధ రాచార్యులు, ఉపాధ్యక్షునిగా లింగోజు వేంకటేశ్వరాచార్యులు, సహయ కార్యదర్శులు గా కె.వే ణుగోపాలాచార్యులు, మట్టపల్లి విజయ్ కుమార్ ఆచార్యులు,
పోలంపల్లి రమణ శర్మ, కార్యవర్గ సభ్యులుగా హరిదాస్యం సుదర్శన ఆచార్యులు, విస్సంపల్లి సాయి చారి లకు స్ధానం లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధూప దీప అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర సంఘంలో స్థానం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ, ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్ శర్మ, కోశాధికారి హరికిషన్ శర్మ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






