calender_icon.png 14 September, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వకర్మ జయంతి సీజీఆర్ కు ఆహ్వానం

14-09-2025 11:24:52 AM

గుమ్మడిదల (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) గుమ్మడిదల మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్‌లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న విశ్వకర్మ జయంతి వేడుకలు, యజ్ఞహోమం ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కే. రవీంద్ర చారి మాట్లాడుతూ... వేడుకలకు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి. లక్ష్మణ్ చారి, సత్యనారాయణ చారి, దామోదర్ చారి, బాలాచారి, రమేష్ చారి, కృష్ణ చారి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.