14-09-2025 12:45:35 PM
గద్వాల (విజయక్రాంతి): నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Bandla Krishna Mohan Reddy) పలు సందర్భాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. తన అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీలో తన ఫోటోలు వాడుతున్నట్లు అటువంటి వారిపైన కేసు నమోదు చేయాలనీ గతంలో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన విషయం సైతం అందరికి తెలిసిందే. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే లపై బి ఆర్ ఎస్ పార్టీ కోర్టు ను ఆశ్రయించగా పార్టీ మారిన ఎమ్మెల్యే లకు నోటీసులు సైతం అందిన విషయం అందరికి తెలిసిందే. బి ఆర్ ఎస్ పార్టీ తరుపున శనివారం జరిగిన గద్వాల గర్జన కార్యక్రమం కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం తో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా అంటూ గద్వాల నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు