calender_icon.png 15 February, 2026 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీకి ఆహ్వానం

15-02-2026 12:00:00 AM

17న బంగ్లా ప్రధానిగా తారీఖ్ ప్రమాణ స్వీకారం

ఢాకా, ఫిబ్రవరి ౧౪: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహ మాన్ ఈనెల 17న ఢాకాలో ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. ఈ వేడుకకు భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీఎన్పీ నిర్ణయించింది. భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ పరిణామం.. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధం బలోపేతం చేసే సంకేతంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ ఇప్పటికే తారిఖ్‌తో ఫోన్‌లో సంభాషించిన సంగ తి తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో తారిఖ్‌కు మద్దతు ఉం టుందని మోదీ భరోసా ఇచ్చారు. చారిత్రక, సాంస్కృతిక పరంగా సన్నిహిత సంబంధాలు కలిగిన పొరుగు దేశాలుగా భారత్, బంగ్లాదేశ్ కొనసాగుతాయని పేర్కొన్నారు.