పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణకు ఆహ్వానం
– మార్చి 5న నిర్వహణ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకం, నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.కె.బి. సునీతాదేవి, మష్రూమ్ ప్రొడక్షన్ ఏఈఎల్పి డైరెక్టర్ డా.రజియా సుల్తానా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.అశ్విని తెలిపారు.
ముత్యపు చిప్ప, పాల పుట్టగొడుగుల పెంపకం, సంరక్షణ, నిర్వహణ పద్ధతులపై మార్చి 5న శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు, యువత, మహిళలు ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కరికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500గా నిర్ణయించగా, శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు. పుట్టగొడుగుల పెంపకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8008738267, 7569113069 నెంబర్లను సంప్రదించవచ్చు.




