27 February, 2026 | 11:11 PM

Breaking News

ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్లు

27-02-2026 09:18 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించలంటూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ టీచర్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలకు కూడా మార్చి 15 నుంచి ఒక్క పూట బడికి అనుమతి ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

అలాగే ఫ్రీ ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించి, అంగన్వాడీ టీచర్లను ఫ్రీ ప్రీ-ప్రైమరీ టీచర్లుగా గుర్తించి కనీస వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మే నెలలో టేక్ హోమ్ రేషన్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఆయా నుంచి టీచర్‌గా పదోన్నతి పొందిన వారికి తగిన వేతనం చెల్లించే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరమణ, ప్రాజెక్టు అధ్యక్షురాలు రోజా, కార్యదర్శి సైదమ్మ, ఖజానాదారు సరిత, ఉపాధ్యక్షురాలు రషీదా, సహాయ కార్యదర్శి శైలజతో పాటు పద్మ, పార్వతి, రాణి, రాములమ్మ, జయశ్రీ, శ్రీలక్ష్మి, రుద్రమ్మ, వెంకటమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.