4 May, 2026 | 3:24 AM

ఐపీఎల్ టికెట్ల బ్లాక్‌మార్కెట్ ముఠా గుట్టురట్టు

04-05-2026 02:08 AM

పోలీసులకు పట్టించిన హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్, మే 3 : నగరంలో ఐపీఎల్ టికెట్ల బ్లాక్‌మార్కెట్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. సన్‌రైజర్స్, కోల్‌కతా మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏ, మల్కాజగిరి స్పెషల్ బ్రాంచ్ ఎస్‌వోటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి బ్లాక్‌మార్కెట్ ముఠా గుట్టురట్టు చేశారు. ఐపీఎల్ టికెట్ల కోసం జడ్జీలు, అధికారుల పేరుతో హెచ్‌సీఏకు కాల్స్ వచ్చాయి. కాల్స్‌పై అనుమానం రావడంతో హెచ్‌సీఏ సెక్రటరీ మన్నె జీవన్‌రెడ్డి మల్కాజ్‌గిరి సీపీ సుమతికి సమాచారం ఇచ్చారు.

దీంతో ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన  మల్కాజగిరి స్పెషల్ బ్రాంచ్ ఎస్‌వోటీ పోలీసులు వారి అదుపులోకి తీసుకున్నారు. పీఎం వో, గవర్నర్, జడ్జీలు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ఎంసీఏ పేర్లు చెబుతూ ఏకంగా నకి లీ లెటర్లు తయారు చేసి ఐపీఎల్ టికెట్ల కోసం ఫోన్లు చేస్తున్నట్టు గుర్తించారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఐపీఎల్ టికెట్లను ఎరగా వేసారు. బ్లాక్‌లో వాటిని అమ్ముతుండగా ఎస్‌వోటీ పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు అశోక్ పోలీసుల అదుపులో ఉండగా మిగిలిన ముఠా కోసం గాలిస్తున్నారు.