4 May, 2026 | 3:28 AM

ఎల్లిపాయకారం అందించడం అభినందనీయం

04-05-2026 02:11 AM
  1. ఎంపీ ఈటల రాజేందర్
  2. అవుట్‌లెట్‌తో ఎంతోమందికి ఉపాధి: ఎమ్మెల్యే గాంధీ

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): సాం ప్రదాయ ఆరోగ్యకరమైన ఎల్లిపాయకారంను నగర ప్రజలకు అందించడం అభినందనీయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆది వారం గచ్చిబౌలిలోని ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ‘ఎల్లిపాయకారం’ నూతన అవుట్‌లెట్‌ను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాం ధీలు కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఎల్లిపాయకారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఈ అవుట్‌లెట్ తెరిచి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న రెస్టారెంట్ నిర్వాహకులను అభినందించారు. అవుట్‌లెట్ ప్రారంభోత్సవంలో నటి కె సుధ, నటులు మధు దామరాజు, మహేష్ ఆచంట, షఫీ, దర్శకుడు కార్తీక్ దండు తదితరులు పాల్గొని రుచులను ఆస్వాదించారు.

నూతనంగా ప్రారంభమైన ఈ ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’ అవుట్‌లెట్‌ను సంప్రదాయ రుచులతో పాటు ఆధునిక శైలిలో తయారు చేసే వివిధ రకాల ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫౌండర్ గంగా విరజ్ కోట, కో- ఫౌండర్ సాయిశ్రీ తెలిపారు. ఎల్లిపాయకారం చికెన్ వేపుడు, ప్రవున్స్ ఘీ రోస్ట్, బిర్యానీ.. వంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నిర్వాహకులు స్పష్టం చేశారు. అన్ని రకాల ఈవెంట్స్‌కి క్యాటరింగ్ సర్వీస్ కూడా అందిస్తామని తెలిపారు.