11 April, 2026 | 4:02 PM

Breaking News

సామాజిక ఉద్యమాల తొలి తరం గొంతుక జ్యోతిబాపూలే   •   మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం   •   కేబుల్ న్యూస్ ఛానల్ వారు దరఖాస్తు చేసుకోవాలి   •   కొండమల్లేపల్లిలో డాక్టర్స్ అకాడమీని మూసివేయాలి   •   బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •  

చదరంగ పోటీలలో ఐపీఎస్ పాఠశాల విద్యార్థిని ప్రతిభ..

13-10-2025 04:58 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పోటీలలో సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాల విద్యార్థిని మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పోటీలు ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని 14 సంవత్సరాల బాలికల విభాగంలో ఏ.అన్విత బ్రాంజ్ మెడల్ సాధించి ఉమ్మడి జిల్లాకు ఎంపికయ్యారు. ఎంపిక పట్ల పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదరంగం ఆడటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ సతీష్, మమత పాల్గొన్నారు.