calender_icon.png 13 October, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఎంత ఖర్చయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

13-10-2025 04:54:15 PM

మేడారం పనులు సకాలంలో పూర్తి చేయడమే నా విధి.. 

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

హైదరాబాద్: మేడారం(Medaram) గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులపై సోమవారం అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అన్ని హంగులతో 90 రోజుల్లో పనులు పూర్తి చేయాలని, మేడారం అభివృద్దికి రూ.212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ చేశామని అన్నారు.

నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అభివృద్ది పనులపై అందరి సూచనలు తీసుకుంటూనే ఉంటామని.. కేవలం ప్రాంగణం అభివృద్ది కోసమే రూ.101 కోట్లు కేటాయించామని అన్నారు. ఎంత ఖర్చు అయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని.. మేడారం పనులు సకాలంలో పూర్తి చేయడమే నా విధి.. అని మంత్రి పొంగులేటి తెలిపారు.