15 April, 2026 | 1:38 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన ఐపీఎస్ పాఠశాల విద్యార్థిని..

23-11-2025 06:38 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్వేత శ్రీ 69వ రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్-17 బాలికల విభాగంలో పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యం ఆదివారం తెలిపారు. ఇటీవల మెట్పల్లి మండలం వెల్లుల్లలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు, ఈ నెల 23 నుంచి 25 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్‌ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు శ్వేతశ్రీ ని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం,శివ, సతీష్,మమత విద్యార్థిని పాల్గొన్నారు.