calender_icon.png 23 November, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు

23-11-2025 06:42:06 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి కోటీ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేడుకల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామన్నారు. డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటికి బొట్టు పెడుతూ చీరలను అందిస్తామన్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు.

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇంద్ర గాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు. బీఆర్ఎస్ హాయంలో పంపిణీ చేసిన చీరలు లబ్ధిదారులు పంటలకు రక్షణగా కట్టేవారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు పండుగలకు, శుభకార్యాలకు వేసుకునే చీరలను అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి మహిళ ఇందిరమ్మ చీరలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సురేందర్, డిఆర్డిఏ అధికారులు, మహిళ సమాఖ్య ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.