calender_icon.png 23 November, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షునికి ఘనంగా సన్మానం

23-11-2025 06:32:29 PM

మందమర్రి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన(డీసీసీ) అధ్యక్షులుగా ఎన్నికైన పిన్నింటి రఘునాథరెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామ్ చందర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం రఘునాథరెడ్డిని ఆయన నివాసంలో కలిసి పూల మొక్కను బహుకరించి ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు దక్కిన నిజమైన గౌరవం డీసీసీ అధ్యక్షునిగా రఘునాథరెడ్డి నియామకం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ నాయకుని గా అంచలంచెలుగా ఎదిగి జిల్లా పార్టీ రథ సారధిగా నియమితులు కావడం హర్ష నీయమన్నారు. ఈ కార్యక్రమం లో సారంగపల్లి మాజీ సర్పంచ్ కమల మనోహర్రావు, నాయకులు ఓదెల సంపత్ రావు, దుర్గం సుధాకర్ లు పాల్గొన్నారు.