14 March, 2026 | 4:22 PM

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు

14-03-2026 03:12 PM

టెహ్రాన్: ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. టెల్ అవీవ్, జెరూసలేం, బేర్షెబా పట్టాణాలపై దాడులు కొనసాగుతున్నాయి. క్లస్టర్ బాంబులతో పాటు, ఇరాన్ మిసైళ్లతో దాడి చేస్తోంది. ఇరాన్ దాడులతో ఇళ్ల నుంచి జనం హైవేలపైకి పరుగులు పెడుతున్నారు. హైవేల పక్కనే తలదాచుకుంటున్నట్లు జనం చెప్తున్నారు. దాడులు ఎక్కువగా నగరాలు, పట్టణాలపైనే జరుగుతుండడంతో ప్రజలు రహదారులను ఆశ్రయిస్తున్నారు. మిసైళ్లను సమర్ధవంతంగా అడ్డుకుంటున్నామని ఐడీఎఫ్ ప్రకటించింది.