13 April, 2026 | 5:57 PM

సముద్రపు దొంగల తరహాలో అమెరికా వైఖరి..! అమెరికాకు ఇరాన్ వార్నింగ్

13-04-2026 04:53 PM

మా భద్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోం.

మేము గల్ఫ్ పోర్టులను మూసివేస్తాం.

భద్రత ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండొద్దు.

టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్(Iran Warning) ఇచ్చింది. గల్ఫ్ ఓడరేవుల యాజమాన్యంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ ఓడరేవులు అందరికీ చెందుతాయని ఇరాన్ తెలిపింది. అందరికీ చెందకుంటే.. ఎవరికీ లేకుండా పోతాయని పేర్కొంది. గల్ఫ్ ఓడరేవులు అయితే అందరికీ.. లేకుంటే ఎవరికీ కావని ఇరాన్ తేల్చి చెప్పింది. 

టెహ్రాన్‌కు చెందిన నౌకలను దిగ్బంధించే ప్రణాళికలను అమెరికా ప్రకటించిన తర్వాత, హోర్ముజ్ జలసంధిపై(Strait of Hormuz) ప్రతిష్టంభన తీవ్రమవుతుండగా, తమ సొంత నౌకా రవాణా కేంద్రాలకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్‌లోని దాని సమీపంలోని అన్ని ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు సరికాదని సూచించింది. అమెరికా ఆంక్షలు(US Sanctions) విధించడం చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించింది.  భద్రత ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండొద్దని ఇరాన్ వెల్లడించింది.