30 June, 2026 | 1:55 PM

ఢిల్లీ దర్బార్‌కు తెలంగాణ ఏటీఎం.. కాంగ్రెస్‌పై నితిన్ నబీన్ విమర్శలు

30-06-2026 01:17 PM

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే

కాంగ్రెస్.. అవినీతి, నేరాల తరహా పాలన

మల్కాజిగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramchander Rao) అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్ లో బేజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్(BJP National President Nitin Nabin) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ లో ఎలా గెలిచారని చాలా మంది నన్ను అడుగుతున్నారు.. బీజేపీ కార్యకర్తల కష్టాలతో పశ్చిమ బెంగాల్ లో గెలిచామని నేను చెప్పాను. బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలను చాలా ఇబ్బందులు గురిచేశారు. పశ్చిమబెంగాల్ లో బీజేపీని గెలిపించాలనే ఆలోచనలతోనే కార్యకర్తలు పనిచేశారని వివరించారు.

తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్.. తెలంగాణ నుంచే ఢిల్లీకి డబ్బులు

తెలంగాణలో సర్ పై ప్రజలకు బీజేపీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో సర్ పై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని వెల్లడించారు. మోదీ నేతృత్వంలో బీజేపీ వెంట నడిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో 12 ఏళ్లలో చాలా పరివర్తన వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెల్లడించారు. బీజేపీని గెలిపించిన రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ లో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని చెప్పిన నితిన్ నబీన్ తెలంగాణ నుంచి ఢిల్లీకి డబ్బులు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆరో గ్యారెంటీలు ఇంకా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్.. అవినీతి, నేరాల తరహా పాలన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ దర్బార్ కు తెలంగాణ ఏటీఎం

కాంగ్రెస్ ప్రభుత్వంపై నితిన్ నబీన్ విమర్శలు చేశారు. తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ఒక్క గ్యారెంటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఢిల్లీ దర్బార్ కు తెలంగాణను ఏటీఎంగా మార్చిందని నితిన్ నబీన్ ఆరోపించారు. ఆర్ ఆర్ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీ దర్బార్ కు పంపిస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రజల సొమ్ము ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని నబీన్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని సూచించారు.