30 July, 2026 | 8:07 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ

26-05-2026 12:45 AM

లంచం తీసుకుంటుండగా పట్టివేత

హనుమకొండ (మహబూబాబాద్), మే 25 (విజయక్రాంతి): హనుమకొండలో ఏసీబీ అధికారులకు సోమవారం ఇరిగేషన్ శాఖకు చెందిన డీఈ పట్టుబడ్డాడు. జనగామ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హనుమకొండ నగరం భవానీ నగర్‌లోని తన ఇంట్లో రూ.50 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

అధికారిక పనుల కోసం లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ పీ.సాంబయ్య తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత సంవత్సరం కాలంగా ఏదో ఒక చోట అవినీతి అధికారులు పట్టుబడుతుండటం సంచలనం సృష్టిస్తున్నది.