30 July, 2026 | 8:22 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •  

పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు

30-07-2026 07:45 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధి పీర్జాదిగూడలో ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల ఉత్సవాలను ఈ సంవత్సరం ఆగస్టు 9న అత్యంత వైభవంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో నిర్ణయించారు.​ ఈ మేరకు గురువారం పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, గ్రామ పెద్దల సమక్షంలో  సమావేశమై బోనాల ఉత్సవాల నిర్వహణపై చర్చించి తేదీని ఖరారు చేశారు.​ కావున, పీర్జాదిగూడ 10వ డివిజన్ ప్రజలందరూ కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొని, అమ్మవారి కృపాకటాక్షాలు పొంది సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.