30 July, 2026 | 8:28 PM

Breaking News

పార్టీలకు అతీతంగా అభివృద్ధి   •   శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి   •   ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •  

బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్

30-07-2026 07:49 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఉప్పల్ గాంధీనగర్ కు చెందిన బాకారం అరుణ్ మహేష్,  (38) అనే వ్యక్తి పీర్జాదిగూడలో శ్రీబాలాజీ సిమెంట్ బ్రిక్స్ పేరుతో సిమెంట్ బ్రిక్స్ తయారీ షెడ్‌ను నిర్వహిస్తున్నాడు. సదరు వ్యక్తి తన సిమెంట్ బ్రిక్స్ తయారీ ప్లాంట్‌లో బాల కార్మికులను పనిలో నియమించినందుకు 2024 సంవత్సరంలో ఒక కేసు, జూలై–2026లో మరో కేసు నమోదు చేయబడిందని తెలిపారు.

అదేవిధంగా 2025 సంవత్సరంలో మరో కేసు నమోదు అయిందని  పై కేసులన్నీ ప్రస్తుతం  న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ పై కేసులు నమోదైన తరువాత కూడా సదరు వ్యక్తి తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు చేసుకోకుండా తన సిమెంట్ బ్రిక్స్ తయారీ షెడ్‌లో బాల కార్మికులను నియమించి పనులు చేయిస్తున్నాడు.  కావున సదరు వ్యక్తి కార్యకలాపాలు, కదలికలను నిరంతరం గమనిస్తూ, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టుటకు అతనిపై సస్పెక్ట్ షీట్ తెరవడం జరిగిందని మేడిపల్లి పోలీసులు తెలిపారు.