30 July, 2026 | 8:38 PM

'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

30-07-2026 08:01 PM

గజ్వేల్: స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని  రాయారావు విశ్వేశ్వరరావు రచించిన ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గజ్వేల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... రాయారావు విశ్వేశ్వరరావు రచనలు సమాజానికి మంచి సందేశాలను అందిస్తూ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయన్నారు. స్నేహబంధాల విలువను, ప్రేమాభిమానాలను ఈ గీతంలో ఎంతో హృద్యంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి, మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోలి సంతోష్, ఆపన్న హస్తం మిత్రబృందం సభ్యులు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కుమారస్వామి, గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య అధ్యక్షుడు శంకర్ శర్మ, కోశాధికారి కృష్ణమూర్తి శర్మ, రాజేశ్వర్, శరత్ తదితరులు పాల్గొన్నారు.