10 June, 2026 | 1:32 AM

శ్వాసకోశ వ్యాధులతో.. శవాలవుతున్నా పట్టింపే లేదా?

10-06-2026 12:00 AM
  1. డంపింగ్ యార్డ్ ఎత్తేసే వరకు సైనికుల్లా ఉద్యమిద్దాం...          
  2. కలుషిత వాతావరణంలో బతుకులు బుగ్గి పాలేనా?                           
  3. ప్రభుత్వం పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తాం..                          
  4. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ కో- కన్వీనర్లు                               

జవహర్ నగర్, జూన్ 9 (విజయక్రాం తి): శ్వాస కోశ వ్యాధులతో ప్రజలు శవాలవుతున్న... ప్రభుత్వానికి పట్టింపు లేదా డం పింగ్ యార్డ్ ను పూర్తిస్థాయిలో ఎత్తివేసి ప్రాణాలను కాపాడాలని లేకుంటే ఇంటికో వ్యక్తి సైనికుడిలా పోరాడుతూ ఉద్యమిద్దామని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తి వేత పోరాట కమిటీ కో కన్వీనర్లు పిలుపునిచ్చారు.

డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమా మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్రగతి నగర్ లోని నీలం రామచంద్రయ్య భవన్లో డంపిం గ్ భూతాన్ని పారదోలాలని భవిష్యత్ కార్యాచరణ పై కో కన్వీనర్ల సమావేశాన్ని నిర్వహిం చారు.

ఈ సందర్భంగా కొండలు ముదిరాజ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా కలుషితమయ్యాయని పశుపక్షాదులు కూడా బ్రతకలేని దుస్థితి నెలకొందని చెత్తతో గుట్టలు గుట్టలుగా మారి పోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని దుయ్యబట్టారు. దుర్వాసనను భరించలేక ప్రజలు ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేస్తున్నారని ప్రజల జీవనస్థితి పై రాంకీ అరాచకాన్ని ప్రభుత్వం కూకటి వేళ్ళతో కదిలించి ప్రశాంత వాతావరణము కల్పించాలని అన్నారు.

డంపింగ్ యార్డ్ ఎత్తివేతకై శాంతియుతంగా పోరాటం తీవ్రతరం చేద్దామని ఈనెల 15న మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రాలు సమర్పిద్దామని ఈనెల 23వ తేదీన ప్రజాభవన్లో వినతి పత్రాలు సమర్పిద్దామని తెలిపా రు. జూలై 26న వెయ్యి మందితో పర్యావరణ శాస్త్రవేత్తలతో భారీ ఎత్తున సదస్సును నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ ప్రభావిత చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి నిరసన చేపాడుదామని తెలిపారు.

ఆయా ప్రాంతాల స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ సంఘాలు కలిసి డంపింగ్ యార్డ్ ఎత్తివేతకై జరిగే ప్రజా ఆందోళనలో భాగస్వాములు చేస్తామని తెలిపారు. పంచభూతాల సాక్షిగా జవహర్‌నగర్‌లో ప్రజలకు జీవించే హక్కు ఉందని అన్ని వర్గాల ప్రజలు జీవించే హక్కులో భాగంగా జరిగే ప్రజాస్వామిక న్యాయమైన పోరాటానికి ప్రజాస్వా మిక మేధావులు సబ్బండ వర్గాల ప్రజలు న్యాయ కోవిదులు విద్యావంతులు పర్యావరణవేత్తలు సంపూర్ణ మద్దతు తెలిపాలని పేర్కొన్నారు.

డంపింగ్ యార్డ్ విముక్తి కోసం ప్రతి ఇంటి నుండి ప్రజల స్వచ్ఛందంగా కదిలి రావాలని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నట్టు పోరాడితేనే మానవ జీవన మనుగడ సాగుతుందని లేదంటే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. జూలై 26న పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నామని ప్రతి కాలనీకి డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీలు చేరాలని తెలిపారు. కార్యక్రమంలో తోటపల్లి శంకర్, శివ బాబు, అరుణ, సుబ్రహ్మణ్యం, సునీత, సావిత్రి, శివన్నారాయణ, బాల నరసింహ గౌడ్, లక్ష్మీబాయి, ప్రఫుల్ రాంరెడ్డి, చంద్రమౌళి, వెంకన్న పాల్గొన్నారు.