10 June, 2026 | 1:06 AM

ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయాలి

10-06-2026 12:00 AM

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపిన జలమండలి 

ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి

ముషీరాబాద్, జూన్ (విజయక్రాంతి): ఇటీవల జల మండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్  మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఐటీ శాఖ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొగుళ్ల రాజిరెడ్డి, తెలంగాణ జల మండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగుల సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ  మొగుళ్ళు రాజిరెడ్డి ని శాలువా, పుష్ప గుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.  రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ. శ్రవణ్ కుమార్, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె.  రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇ. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.