17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మాపై అణు దాడికి దిగితే.. పాక్ ప్రతిదాడి చేస్తుంది: ఇరాన్

16-06-2025 02:51 PM

టెహ్రాన్: ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ ఇరాన్‌లోని అత్యున్నత జనరల్స్‌లో ఒకరైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జనరల్ ఇరానియన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహ్సేన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇరాన్ పై అణుదాడికి దిగితే అందుకు ప్రతికారంగా పాకిస్థాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తోందని హెచ్చరించారు. పాక్ నుంచి హామీ లభించిందని ఇరాన్ ఐఆరజీసీ జనరల్ వెల్లడించారు. తుర్కియే, సౌదీ అరేబీయా, పాకిస్థాన్, ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయని ఇరాన్ తెలిపింది. 

అణు బాంబు వేస్తుందన్న ఇరాన్ జనరల్.. తోసిపుచ్చిన పాక్

అయితే, పాకిస్తాన్ అలాంటి వాదనలను ఖండించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెజాయ్ వాదనను తోసిపుచ్చారు. ఇస్లామాబాద్ వారి ప్రమేయం గురించి అలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రికి మూడవ పార్టీ వివాదంతో సంబంధం లేదని ఖ్వాజా ఆసిఫ్ పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్‌తో ఈ వివాదంలో పాకిస్తాన్ ఇరాన్‌కు తన మద్దతును అందించినప్పటికీ, వారు తమ వ్యక్తిగత ప్రమేయం గురించి ఇంకా ఎటువంటి నిబద్ధత ప్రకటించలేదని తెలిపారు. ఇంతలో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉండటంతో ఇరాన్, ఇజ్రాయెల్ ఒకదానికొకటి క్షిపణులను ప్రయోగించడం కొనసాగించాయి.