21 July, 2026 | 9:21 PM

Breaking News

ప్రకృతి ఆరాధనకు ప్రతీక శీతల భవానీ పండుగ   •   ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్   •   అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత   •   బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ   •   తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •   వర్షంలోనూ పారిశుధ్య పనుల్లో ఉపసర్పంచ్   •  

తన ఉత్సాహం చూస్తే చాలదా..

08-03-2025 12:00 AM

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘పాబ్లో నెరుడా..’ అనే ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించారు. అచ్చు రాజమణి బాణీ కట్టగా, బెన్నీ దయాల్ ఆలపించారు. ‘ఏ ఉప్పెనలూ చూడక్కర్లా.. తన ఉత్సాహం చూస్తే చాలదా.. ఏ అద్భుతమూ చూడక్కర్లా..

తన పోరాటం చూస్తే చాలదా..’ హీరోను పరిచయం చేసే ఈ గీతం సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసింది. సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా ఈ చిత్రం లో వైష్ణవిచైతన్య నటిస్తుండగా.. ప్రకాశ్‌రాజ్, నరేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.