31 July, 2026 | 9:25 PM

"పుష్పక్" హ్యాట్రిక్.. సేఫ్ ల్యాండింగ్

23-06-2024 12:42 PM

కర్నాటక: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ పరీక్ష విజయవంతం అయింది. పుష్పక్ వాహక నౌకను ఇస్రో మూడోసారి విజయవంతగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏనోనాటికల్ టెస్ట్ రేంజ్ లో పుష్పక్ వాహకనౌకను పరీక్షించారు. 4.5 కి.మీ. ఎత్తు నుంచి హెలికాప్టర్ ద్వారా పుష్పక్ ను శాస్త్రవేత్తలు జారవిడిచారు. స్వయంప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో పేర్కొంది. తీవ్రమైన గాలుల మధ్య పుష్పక్ తనంతట తానుగా కిందికు దిగిందని తెలిపారు. ఇటువంటి "సంక్లిష్ట మిషన్లలో" విజయ పరంపరను కొనసాగించడంలో అంకితభావంతో పనిచేస్తున్న బృందానికి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.