లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్
కర్నాటక: మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై పార్టీ కార్యకర్త లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు తెలిపారు. జూన్ 16న గన్నికాడలోని రేవణ్ణ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగిందని 27 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు మేరకు రేవణ్ణ (37)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా, హోలెనరసిపురా పోలీసులు సూరజ్ పై IPC సెక్షన్లు 377 (అసహజ నేరాలు), 342 (తప్పుగా నిర్బంధించడం) 506 (నేరపూరిత బెదిరింపు) కింద శనివారం సాయంత్రం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి మేనల్లుడు రేవణ్ణ ఆరోపణలను ఖండించారు. ఫిర్యాదుదారు రూ. 5 కోట్లు ఇవ్వాలని పార్టీ కార్యకర్త బెదిరించినట్లు సూరజ్ తెలిపాడు. రూ. 5 కోట్లు ఇవ్వకపోవడంతోనే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.






