1 May, 2026 | 11:30 PM

దేశ గౌరవానికే భంగకరం

07-02-2025 12:00 AM

డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహంకారంతో, ద్వంద్వనీతులతో, మానవ గౌరవాన్ని పూర్తిగా విస్మరించే ధోరణితో ముడిపడ్డవే. విద్య, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులను సైనిక కార్గో విమానాల్లో అవమానకరంగా వెనక్కి పంపింది కేవ లం కఠిన విధానం కాదు.

ఇది మానవత్వంపై చేసిన మాఫ్ చేయలేని నేరం. వీళ్లంతా నేరస్తులు కాదు; కేవలం కొన్ని వీసాల ఉల్లంఘనలు ఉంటే, వారిని నేరస్తుల్లా బంధించడం సరైన చర్య కాదే. ఈ దారుణానికి ప్రపంచ ప్రజలు గళం విప్పాలి.

ఇక్కడ అసలు విషయంలోని విరోధాభాసాన్ని మర్చిపోవడం ఎలా? ట్రంప్ కుటుంబమే వలస కుటుంబం. ఆయన తల్లి మేరీ యాన్ మాక్లియడ్ స్కాట్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చిందే. ఆయ న తాత ఫ్రెడ్రిక్ ట్రంప్ జర్మనీలో పుట్టి అమెరికా స్థిరపడ్డారు. ట్రంప్ తన నరనరంలో ఉన్న వలస చరిత్రను మరచిపోయి వలసదారులపై ద్వేషాన్ని పెంచుతున్నారు.

అదే ‘ట్రంప్ విధానాన్ని’ ఆయనపైనే అమలు చేస్తే ఎలా ఉంటుంది? తనను కూడా ‘చట్టవ్యతిరేక వలసదారుడు’ అని జర్మనీ లేదా స్కాట్లాండ్‌కు పంపించాల్సి వచ్చేది. నిజానికి ట్రంప్ కుటుంబమే అసలు వలస సమస్య అని చెప్పాలి.

చట్ట వ్యతిరేక వలసదారుల్ని గుర్తించినప్పుడు, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వారిని గౌరవ ప్రదంగా, ఆ దేశాల నేతలతో చర్చలు జరిపి, సాధారణ వాణిజ్య విమానాల్లోనే పంపాలి. కానీ, ట్రంప్ ఈ సూత్రాలను తుంగలో తొక్కి, భారతీయులను సైనిక కార్గో విమానాల్లో నేరస్తుల్లా బంధించి పంపాడు. ఇది కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు, భారత్ వంటి దేశాల గౌరవాన్ని కూడా దిగజార్చే చర్య.

యావత్ ప్రపంచం గళం విప్పాలి

అమెరికా చట్టాల ప్రకారం వలసదారుల పిల్లలు అమెరికాలో పుట్టినట్లయితే వారికి పౌరసత్వ హక్కు లు స్వయంగా లభిస్తాయి. అయినా, ట్రంప్ ప్రభు త్వం కేవలం చట్టవ్యతిరేక వలసదారులకే కాకుండా చట్టబద్ధంగా ఉన్న వలసదారుల కుటుంబాలపై కూ డా ద్వేషంతో నడుచుకుంది.

ఇది కేవలం వలసదారుల సమస్య కాదు; ట్రంప్ ద్వేష రాజకీయాలపై ఒక స్పష్టమైన ఉదాహరణ. ఆయన పాలనలో జాతి, వర్ణం, మతం ఆధారం గా తేడాలు స్పష్టంగా కనిపించాయి. భారత ప్ర భుత్వం ఎల్లప్పుడూ అమెరికాతో సహకరిస్తూ, చట్టవ్యతిరేకంగా ఉన్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది.

అయినప్పటికీ, ట్రంప్ దానిని పట్టించుకో కుండా భారతీయులను అవమాన పర్చాడు. ఇది కేవలం వ్యక్తులపై కాదు, భారత్‌పట్ల కూడా అవమానకరమైన చర్య. ఇది కేవలం భారతీయుల సమస్య కాదు.

ప్రపంచమంతా ఇలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాలి. అమెరికా ఎదుగుదలకు కారణం వలసదారులే. అనేక రంగాలలో విజ్ఞానం, పరిశ్రమ, కళ, సాంకేతికత వలసదారులే ప్రధాన పాత్ర వహించారు. కానీ, ట్రంప్ అమెరికా చరిత్రను విస్మరించి, వలసదారుల్ని నేరస్తుల్లా చిత్రించడంలో కృతనిశ్చయం తో ముందుకు సాగుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ట్రంప్ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంత టా, ప్రపం చ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. మే ధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీడియా కూ డా ఆయన దారుణాలపూ విరుచుకుపడుతోంది.

కేవలం నిరసనలు సరిపోవు. ప్రపంచ దేశాలు ట్రంప్ అమెరికా విధానాలపై గట్టి ప్రతికూల విధానాలు చేపట్టాలి. అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని, దా ని సుంక విధానాలను, అగ్రరీతి ప్రవర్తనను ఎదుర్కోవడానికి ప్రపంచం ఒక్కటిగా ఐక్యమవ్వాలి. చిన్న దేశాలను బెదరించే ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది.

ట్రంప్ పాలన కేవలం వలస దారుల పట్ల ద్వేషంతోనే కాదు, మానవత్వానికి వ్యతిరేకంగానూ నిలిచింది. ఆయన జాత్యహంకార విధానాలు, విస్తరణవాద కలలు, ఇతర దేశాలపై ఆగ్రహావేశ ధోరణి ప్రపం చం గుండెను కలచివేస్తున్నాయి.

ఆయన గోడలు కట్టించవచ్చు కానీ, చరిత్ర ఆ గోడలను కూల్చివేస్తుంది. ట్రంప్ జ్ఞాపకాలు పౌరసత్వం లేదా చట్టాల కోసం చేసిన గొప్ప కృషి ద్వారా కాదు ద్వేషం, విభజన, మానవ హక్కుల అవమానాలుగా గుర్తింపు పొందుతాయి. వలసదారుల పట్ల ద్వేషం చూపిన నేతగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు.

 డా. కోలాహలం రామ్‌కిశోర్