కులగణన సర్వేలో శాస్త్రీయత ఎంత?
జనగణనలో భాగంగా కులగణన జరగాలని దశాబ్దాలుగా బలహీనవర్గాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ, కేంద్రంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ డిమాండ్ కార్యరూ పం దాల్చలేదు. 1931 వరకే జనగణనలో భాగంగా కులగణన జరిగింది కానీ, స్వా తంత్య్రం వచ్చాక ఏడు పర్యాయాలు జనా భా లెక్కల సేకరణ జరిగితే ఒక్కసారి కూడా బలహీన వర్గాల జనాభా ఎంత శాతం అనే లెక్కలు మాత్రం తీయలేదనే అసంతృప్తి ఆ వర్గాలనుంచి వ్యక్తమవుతుంది.
ఈ నేపథ్యంలో 2022లో బీహార్ రాష్ట్రం లో ‘బీహారీ జాతి ఆధారిత కులగణన’ పేరుతో ఆ రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగాలలో వెనకబాటుతనంపై ఒక సమగ్ర సర్వేద్వారా నివేదికను తయారుచేశారు. తర్వాత దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ తోపాటు ఆయా రాష్ట్రాలలోనూ కులగణన డిమాండ్ తెరపైకి వచ్చింది.
తెలంగా ణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా జాతీయ కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామనే హామీని ‘కామారెడ్డి డిక్లరేషన్’లో పొందుపరిచారు. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్రంలో ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ చేసి నివేదికను ఈనెల 4న శాసనసభ ఆమోదానికి సభలో ప్రవేశ పెట్టింది.
బీహార్ రాష్ట్రంలో జరిగిన కులగణనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీల జనాభా శాతం వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించక పోవటంతో వివాదమైంది. సర్వే రిపోర్టు శాస్త్రీయతను ప్రశ్నిస్తూ ఆమోదయోగ్యం కాదని బలహీన వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే రిపోర్ట్ ‘దేశానికి దిక్సూచి, రోల్ మోడల్’ అని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమనీ ప్రభుత్వం చెప్తుంది. కానీ, సర్వే రిపో ర్ట్‌పై బలహీన వర్గాలనుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రిపోర్టుపైన సూచనలు, సలహాలు అడుగుతుంది.
కానీ, సందేహాలు నివృత్తి చేయ కుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయ త్నం చేస్తుందనే అనుమానాలూ కలుగుతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు బయట పెట్టకుండా గత ప్రభుత్వం, అశాస్త్రీయమైన సర్వే రిపోర్ట్‌ని వెల్లడించి ప్రస్తుత ప్రభుత్వం బలహీనవర్గాలను మోసం చేశాయనే అభిప్రాయం ఆ సామాజిక వర్గాలనుంచి వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వాలు మారితే లెక్కలు మారుతాయా?
సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం ఉన్న బీసీలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో 46 శాతానికి ఎలా తగ్గుతారు? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం జనాభా 3.51 కోట్లు కానీ ప్రస్తుత రిపోర్టు ప్రకారం రాష్ట్ర జనాభా 3.54 కోట్లుగా చూపెట్టారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో జనాభా 1.3 శాతం పెరిగితే రాష్ట్ర జనాభా దరిదాపు 4.20 కోట్లుగా ఉండాలి.
అంటే, సర్వే రిపోర్ట్‌లో 60 నుంచి 70 లక్షల జనాభా పరిగణలోకి రాలేదనే విషయాన్ని గమనించాలి. వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన వివిధ వర్గాల జనాభా శాతం మారే అవకాశమూ ఉంది. ఎన్నికల కమిషన్ ప్రకారం తెలంగాణలో 3.35 కోట్ల ఓటర్లు ఉంటే సర్వే ప్రకారం రాష్ట్రంలో 3.54 కోట్ల జనాభా ఉన్నట్లుగా చూపెట్టారు.
అంటే, ఓటరుగా అవకాశం లేనివా రు తెలంగాణలో కేవలం 19 లక్షలేనా? ఎస్సీ ఎస్టీ, మైనార్టీల జనాభా సమగ్ర కుటుంబ సర్వేలోనూ, ప్రస్తుత సర్వేలోనూ దరిదాపు ఒకే విధంగా ఉంది. కానీ, ప్రస్తు త సర్వేలో అగ్రవర్ణాల జనాభా శాతాన్ని పెంచి 15.79 శాతంగా చూపెట్టటంతో బీసీల జనాభా శాతం గణనీయంగా తగ్గి 46 శాతానికి పరిమితమైనట్లుగా సర్వే చూపెడుతుంది.
అగ్రవర్ణాలలో ఒక సామాజిక వర్గ జనాభాను 17 లక్షలుగా చూపెట్టారు కాబట్టే, శాసనసభలో ఎస్సీ జనాభా పూర్తి వివరాలను బయట పెట్టినట్లుగానే బీసీల జనాభా కులాల వివరాల ను బయట పెట్టలేదనే అనుమానాలు బలపడుతున్నాయి.
భవిష్యత్తులో ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్‌ల అమలుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉద్దేశపూర్వకంగా అగ్రవర్ణాల జనాభాని ఎక్కువ చేసి చూపించే క్రమంలో బీసీల జనాభా శాతం తగ్గిపోయిందనే సందేహాలూ వ్యక్తమవుతున్నా యి. తెలంగాణలో 1.17 కోట్ల కుటుంబాలు ఉంటే సర్వే రిపోర్ట్‌లో 1.12 కోట్ల కుటుంబాలని పరిగణలోకి తీసుకోవటం, సర్వే ఫార్మాట్ కూడా 57 ప్రశ్నలు, ఉప ప్రశ్నలతో గందరగోళంగా ఉండటంతో వాస్తవికతను ప్రతిబింబించటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మైనార్టీ బీసీలతో కలిపి బలహీన వర్గాల జనాభా 61 శాతం కంటే అధికంగా ఉండాలి కానీ, రిపోర్ట్‌లో బలహీన వర్గాల జనాభాని మైనార్టీ బీసీ జనాభాతో కలిపి 56.33 శాతంగా చూపించటాన్ని కూడా ఆ వర్గాలు వ్యతిరేకిస్తూ శాస్త్రీయతను ప్రశ్నిస్తున్నారు.
స్పష్టతనిస్తున్న ప్రభుత్వం
కులగణన తర్వాత రిపోర్టు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. ప్రభుత్వ సర్వే రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు దదాపు 28 శాతం ఉన్నారు కాబట్టి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా స్థానిక సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మిగిలిన 22 శాతం రిజర్వేషన్లకే ఇతర రిజర్వ్ కేటగిరి వర్గాలు (బీసీలు, మైనార్టీ బీసీలు 56 శా తం) అర్హులవుతారు.
మరి, కాంగ్రెస్ ప్రభు త్వం బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ కులగణన రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల బిల్లుని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పం పినా ఆ తీర్మానానికి ఆమోదం లభిస్తేనే క దా, 42 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చేది.
రాష్ట్ర శాసనసభ ఆమోదించినంత మాత్రాన 42 శాతం రిజర్వేషన్లు అమలులోకి రావు. దానికి ఒక సుదీర్ఘ రాజకీయ న్యాయ ప్రక్రియ ఇమిడి ఉంటుంది. అది పూర్తవటానికి ఎంతకాలమైనా పట్టొచ్చు. అప్పటి వరకు 42 శాతం రిజర్వేషన్లు అమలులోకి రావు. ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు కాపాడుకోవడం కూడా కష్టమవుతుంది.
చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు సా ధ్యమయ్యే అవకాశాలు కనపడటం లేదు కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణన రిపోర్టు శాసనసభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు పా ర్టీ పరంగా తాము బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, కనుక ప్రతిపక్షాల వైఖరి చెప్పాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు సవాల్ విసిరారు.
అంటే, ఒక విధంగా రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తున్నట్లుగానే కనబడుతుంది కానీ, చట్టబద్ధంగా వచ్చే రిజ ర్వేషన్లకు, పాలనాపరంగా వచ్చే రిజర్వేషన్లకు చాలా తేడా ఉంటుందనేది అందరూ గమనించాలి.
తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,769 నుంచి 13 వేలకు పెరిగితే 23 శాతం రిజర్వేషన్ ప్రకారంగా 2,990 పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అవుతాయి. అలాకాక 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేస్తే 5,460 గ్రామపంచాయతీలలో బీసీలకు అవకాశం దక్కుతుంది.
మూడు పార్టీలు 42 శాతం ప్రకారంగా బీసీలకు అవకాశాలు ఇస్తే 16,380 మంది బీసీలు సర్పంచ్‌లుగా పో టీ చేసే అవకాశం దక్కించుకుంటారు. లే దా ప్రభుత్వం పార్టీలు మోసం చేశాయని బీసీలు భావిస్తే 9,490(2,990 రిజర్వ్ + 6500 అన్ రిజర్వ్) గ్రామ పంచాయతీలో బీసీలు పోటీ చేసే అవకాశాలు ఉంటాయి.
వ్యతిరేకత తప్పేలా లేదు
కులగణన రిపోర్టులో బీసీల జనాభా తక్కువగా చూపెట్టటం స్థానిక సంస్థలలో బీసీలకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేని పరిస్థితులలో ప్రభుత్వం పై బీసీలలో వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. మొక్కుబడిగా ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందనే భావన బీసీలకు కలిగితే,
అది ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం చేస్తుం ది. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో హామీ మేర కు బీసీల అభివృద్ధి, సంక్షేమాలకు రూ. 20 వేల కోట్లను కేటాయించకపోతే ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లుగానే బీసీలు భావించే అవకాశాలు కనపడుతున్నాయి.
వ్యాసకర్త సెల్: 9885465877






