23 June, 2026 | 11:02 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

ప్రేమే పునాదిగా!

07-02-2025 12:00 AM

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో ప్రారంభమైన ‘వాలంటైన్స్ వారో త్సవాలు’ ప్రతి ఏట ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు నిర్వహిస్తారు. చివరి రోజు న ‘వాలంటైన్స్ దినం’ (ప్రేమికుల దినం)  పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ వారోత్సవాల్లో తొలి రోజున యువజంట ఒకరినొకరు గులాబీలను ఇచ్చి పుచ్చుకొని ప్రేమను వ్యక్తం చేసుకుంటారు.

రెండవ రోజు ప్రేమను ప్రకటిస్తూ, ప్రతిపాదించుకుంటారు. ఇలా ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమాలతో దగ్గరవుతారు. రోమన్ క్యాథలిక్ చర్చ్‌కు చెందిన సెయింట్ వాలంటైన్ యువ ప్రేమికులను ఏకం చేయడం, ప్రేమకు పట్టాభిషేకం చేయడానికి తన ప్రాణాలను సహితం అర్పించాడు.

ఆ రోజున యువజంట ఒకరినొకరు మనసు విప్పి తమ ప్రేమానురాగాలను, అప్యాయతలను ధైర్యంగా వ్యక్తం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. రోమన్ యువ సైనికులు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని నిషేధించారు. నాటి రోమన్ చక్రవర్తి క్లాడియస్- విధించిన వివాహ నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ ప్రేమకు పట్టం కట్టడానికి పూనుకొన్నాడు సెయింట్ వాలంటైన్.

ఆ యువజంటలను ఏకం చేస్తూ పెళ్లి పీటల వరకు తెచ్చాడు. తన నిషేధాజ్ఞలకు విరుద్ధంగా యువ సైనికులకు వివాహాలు చేసిన సెయింట్ వాలంటైన్‌కు క్రీ. శ. 273 ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించారు. అలా సెయింట్ వాలంటైన్ అమరత్వం పొందాడు. ఆయన వర్ధంతి రోజునే ‘వాలంటీన్స్ దినం’గా జరుపుకుంటున్నారు. 

పాశ్చాత్య పోకడలు వద్దు!

పాశ్చాత్య దేశాలలో యువత ఇలాంటి ప్రేమలు వ్యక్తం చేసుకోవడం సర్వసాధారణం. కానీ, భారతీయ సంస్కృతిలో పాశ్చాత్య పోకడలకు ఆదరణ తక్కువ. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో యువతకు ప్రేమకు, కామానికి తేడా తెలియకుండా పోతున్నది.

తల్లితండ్రులు కుదిర్చిన పెండ్లిళ్లు లేదా ప్రేమ వివాహాలు ఏదైనా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వివాహబంధంతో ఏకమవుతారు.

తమ వైవాహిక జీవితాన్ని కడదాక ఆస్వాదించాలని, ఆదర్శ జంటగా కుటుంబ జీవనం గడపాలని అందరూ కోరుకుంటారు. ‘వాలైంటైన్స్ డే’ను ఒక ప్రేమస్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పు లేదు, కానీ మొత్తంగా పాశ్చాత్య పోకడలు మన సమాజానికి మంచిది కాదు.

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి