17 April, 2026 | 10:06 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శాసనమండలిలో నిరుద్యోగ కళాకారుల గురించి మాట్లాడటం సంతోషకరం

29-03-2025 05:35 PM

ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను ఆదుకోవాలి..

సిద్దిపేట: నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని అసెంబ్లీలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, శాసనమండలిలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలు మాట్లాడడం సంతోషకరమని నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు పిన్నింటి దాసు, కుంచం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజా గొంతుకలై పాడిన కళాకారులకు చాలామందికి నేటికీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

ఈ విషయాన్ని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల దృష్టికి తీసుకెల్లామని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులను ఆదుకుంటుందని తమకు తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తుంది అనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని... లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు విదుమౌళి,మురళీ, ఐలయ్య పలువురు పాల్గొన్నారు.