మా వాళ్లను పెండ్లి చేసుకొంటే లీగల్!
వలసలపై కీలక ప్రకటన చేసిన బైడన్
వాషింగ్టన్, జూన్ 18: అమెరికాలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన విదేశీయులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్ శుభవార్త చెప్పా రు. అమెరికా పౌరులను పెండ్లి చేసుకొంటే చట్టవ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించినవారికి కూడా అమెరికా పౌరసత్వం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం కొత్త చట్టం తెస్తున్నట్టు వెల్లడించారు. ఈ చట్టం ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం పదేండ్లు అమెరికాలో నివసించి ఉండాలని, ఈ ఏడాది జూన్ 17వ తేదీలోపు అమెరికా పౌరులను వివాహం చేసుకొని ఉండాలని మంగళవారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బైడన్ తెలిపారు. ఈ పథకం ద్వారా దాదాపు 5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. అక్రమ వలసదారుల పిల్లలు 50 వేల మంది కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతుంది.






