ఢిల్లీలో మండుతున్న ఎండలు
న్యూఢిల్లీ, జూన్ 18 : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. వేసవి ముగిసినా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గడం లేదు. సోమవారం ఢిల్లీలో రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, పంజాబ్, జార్ఖండ్‌లలో విపరీతమైన వేడిగాలు లు వీస్తుండటంతో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎండ తీవ్రత కారణంగా ఆయా రాష్ట్రాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ తాకి బీహార్‌లో గత 24 గంటల్లో 22 మంది మరణించారు. సోమవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాంకేతిక లోపం తలెత్తి ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లాల్సిన ఇండిగో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.






