16 July, 2026 | 5:27 PM

ముంబైలో దారుణం

19-06-2024 12:00 AM

నడిరోడ్డుపై మాజీ ప్రియురాలి హత్య

 ముంబై, జూన్ 18 : ముంబైలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిపై దాడి చేసి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య చేశాడు. యువతిని హత్య చేస్తుండగా పక్కనే ఉన్న వారు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు.  ఈ హత్యకు సంబంధించిన మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డుంది. ముంబై వసాయ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఆర్తి యాదవ్ ఆఫీస్‌కు వెళ్తున్న క్రమంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ యాదవ్ తనని ఫాలో అయ్యాడు. అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసి లావుపాటి స్పానర్‌తో తలపై పలుమార్లు కొట్టాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటనను ఎవరూ ఆపకపోగా.. వీడియోలు తీయడం పలు విమర్శలకు తావిస్తోంది. హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.