యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
28-04-2026 12:00 AM
నాగోల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హయత్నగర్ డిపో వద్ద ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి పాల్గొని ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ డిపో ఆర్టీసీ ఉద్యోగులు, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు శివతో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






