20 March, 2026 | 10:03 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

లావణ్యపై మాల్వీ ఫిర్యాదు

08-07-2024 12:00 AM

నన్ను అనవసరంగా లాగారు: మాల్వీ

నా వద్ద ఆధారాలు ఉన్నాయి, పోలీసులకు ఇస్తాను

రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య

తమ వ్యవహారంపై సినీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి 

రాజేంద్రనగర్, జూలై7: లావణ్య తనను అనవసరంగా కేసులోకి లాగిందని హీరోయిన్ మాల్వీ మల్హో త్రా ఆరోపించింది. లావణ్య ఆరోపణలు పూర్తిగా సత్యదూరంగా ఉన్నాయని తెలిపింది. తనకు ఏమా త్రం సంబంధం లేకపోయినా ఈ విషయంలో నిరాధారంగా లాగారని ఆరోపిస్తూ ఆదివారం ఆమె ఉమెన్ సేఫ్టీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్ తనకు కేవలం సహ నటుడు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. రాజ్‌తరుణ్ వ్యక్తిగత జీవితంతో తనకు సంబంధం లేదని పేర్కొంది. లావణ్య హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంటున్న తన సోదరుడిపై అనవసర ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. తప్పడు, నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని హీరోయిన్ మాల్వీ డిమాండ్ చేశారు. ఇది రాజ్‌తరుణ్, లావణ్య కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అంశమన్నారు. గత ఆగస్టు, సెప్టెంబర్‌లో తమ సినిమా షూటింగ్ పూర్తయిందని, అప్పటినుంచి తామిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. 

నావద్ద ఆధారాలు ఉన్నాయి: లావణ్య 

తాను ఫిర్యాదు చేసిన ప్రతి అంశంలో తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య తెలిపింది. నార్సింగి పోలీసులు తన కు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని పేర్కొంది. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలను వారికి సమర్పిస్తానని ఆమె స్పష్టం చేసింది. రాజ్‌తరుణ్ తాను 11ఏళ్లు గా ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. గత మూడునెలలుగా అతను తనను దూరం పెట్టాడని చెప్పింది. హీరోయిన్ మాల్వీతో అతడికి అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. మాల్వీ తమ జీవితంలోకి వచ్చిన తర్వాత మా మధ్య దూరం పెరింగిందని చెప్పింది. వరలక్ష్మిటిఫిన్స్ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాం టి సంబంధం లేదని చెప్పింది. తనను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే రాజ్‌తరుణ్ ఆరోపణలు చేస్తు న్నారని లావణ్య తెలిపింది. మస్తాన్ తన ఫ్రెండ్ కావడంతో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారంది. రాజ్ నాతో ఏడేళ్లు సంసారం చేశాడని చెప్పింది. మాల్వీ మా జీవితాల్లో నుంచి వెళ్లిపోవాలి, తాను న్యాయపోరాటం చేస్తానని లావణ్య స్పష్టం చేసింది. 

మస్తాన్ నా ఫ్రెండ్ మాత్రమే 

మస్తాన్ సాయి తన స్నేహితుడు మాత్రమేనని లావణ్య తెలిపింది. తనతో నాకు ఎలాంటి సంబం ధం లేదంది. రాజ్‌తరుణ్, తాను ఓ గుడిలో వివా హం చేసుకున్నామని, అతడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని తెలి పింది. తాను రాజ్‌తరుణ్‌తోనే కలిసి ఉండాల నుకుంటున్నట్లు లావణ్య చెప్పింది. రాజ్‌తరుణ్ వ్యవహారంలో తాను సినీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేస్తాన ని చెప్పింది. తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు కాపాడాలని లావణ్య విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంలో మీడియా నాకు సపోర్ట్‌గా నిలవాలని కోరింది. ఈ నేపథ్యంలో లావణ్య, రాజ్‌తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.