22 June, 2026 | 3:14 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

సోనును లైలాగా మార్చింది చరిష్మానే!

18-01-2025 12:00 AM

విశ్వక్‌సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. సోను మోడల్‌గా, లైలాగా విశ్వక్‌సేన్ రెండు డిఫరెంట్ లుక్స్ బజ్ క్రియేట్ చేశాయి.

ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు కూడా మంచి స్పందనను వచ్చింది. తాజాగా శుక్రవారం మేకర్స్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సోను మోడల్‌గా, లైలాగా డిఫరెంట్ పర్సనాలిటీల్లో కనిపించి, నవ్వించారు. సిటీలో బ్యూటీ పార్లర్ నిర్వహించే సోను మోడల్ స్థానిక మహిళలతో మాట్లాడటం అక్కడి మగవాళ్లకు నచ్చకపోవటం, సోను చరిష్మా అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడం వంటి పరిస్థితుల్లో లైలాగా మారడం ఆసక్తిగా ఉంది. ఈ చిత్రానికి రచన: వాసుదేవ మూర్తి; సంగీతం: లియోన్ జేమ్స్; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.