కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నిమ్మనగోటి శ్రీకాంత్
21-08-2026 10:18 PM
మోతె,(విజయక్రాంతి): మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి సమక్షంలో శుక్రవారం మోతె మండల కేంద్రానికి చెందిన నిమ్మనగోటి శ్రీకాంత్ ను కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మోతె మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి శ్రీకాంత్ ను పార్టీ కండువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సేల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి, మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు, సామ చిన్న వెంకటరెడ్డి, బొక్క ఎల్లారెడ్డి, అయిత బోయిన వెంకన్న, బొడ్డు సాలయ్య, మాజీ అధ్యక్షుడు బొక్క ఉపేందర్ రెడ్డి, గురిజాల వెంకన్న,గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






