కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయం
డైరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్
కామారెడ్డి,(విజయక్రాంతి): డైరీ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయమని డైరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి డైరీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వా విద్యార్థి దొడ్ల డైరీ చైర్మన్ సునీల్ రెడ్డి హాజరయ్యారు. 1991 నుంచి 2026 వరకు డైరీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
డైరీ పీజీ విద్యార్థుల కోసం దొడ్ల డైరీ ఆధ్వర్యంలో 6.5 కోట్ల నిధుల ద్వారా ఏర్పాటుచేసిన దొడ్ల బాక్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రిజిస్టర్ డాక్టర్ శరత్చంద్ర, డైరీ కళాశాల డెన్ డాక్టర్ సురేష్ రాథోడ్, దొడ్ల డైరీ సిఈఓ సివికే రెడ్డి, నరసింహారెడ్డి, డైరీ కళాశాల ప్రొఫెసర్లు, పిడి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






