9 April, 2026 | 5:09 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

స్కాట్లాండ్ చేతిలో ఇటలీ ఓటమి

10-02-2026 01:59 AM

కోల్ కత్తా, ఫిబ్రవరి 9 : టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు రీప్లేస్ మెంట్‌గా వచ్చిన స్కాట్లాండ్ తొలి విజయాన్ని అందుకుంది. ఇటలీపై 73 పరుగుల తేడాతో నెగ్గి మెగా టోర్నీలో బోణీ కొట్టింది. తొలుత బ్యా టింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 207 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ జార్జ్ ము న్సీ 84, బ్రెండన్ మెక్‌ముల్లెన్ 41, మైకె ల్ లీస్క్ 22 పరుగులతో దుమ్మురేపారు. అలా గే మిచెల్ జోన్స్ 37 రన్స్ చేశాడు.

ఛేజింగ్‌లో ఇటలీ తొలి బంతికే ఓపెనర్ జస్టిన్ మో స్కా లీస్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే బెన్ మానేటి హఫ్ సెంచరీతో అదరగొట్టాడు. హర్రీ మానే టి 37, జేజే సమ్స్  22 పరుగులతో రాణించారు. అయితే కీలక సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు పట్టుబిగిం చి వరుసగా వికెట్లు కూల్చారు. దీంతో స్కా ట్లాండ్ భారీ విజయం ఖాతాలో వేసుకుంది.