13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

భారత్‌కు ఐదు గోల్డ్ మెడల్స్

10-02-2026 01:03 AM

సౌత్ ఏషియా సెపక్ తక్రా చాంపియన్‌షిప్‌లో ఘనత

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కొలంబోలో జరిగిన సౌత్ ఏషియా సెపక్ తక్రా చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించా యి. ఐదు బంగారు పతకాలు సాధించి అద్భుత విజయాలను నమోదు చేశాయి. సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ పెరిక సురేష్  వివరాలను వెల్లడించారు. సెపక్ తక్రా మేనేజ్మెంట్ కమి టీ నాయకత్వంలో ఈ లెగ్ వాలీబాల్ వేగం గా ప్రాచూర్యం పొందుతోందని అన్నారు.

ప్రధాని మోదీ  ’ఖేలో ఇండియా ఖేలో’ ఉద్య మ స్ఫూర్తిని సాకారం చేస్తూ భారత ఆటగాళ్లు చారిత్రక విజయం సాధించారని పేర్కొ న్నారు. ఇటీవల టోక్యోలో జరిగిన 2026 ఏషియన్ గేమ్స్ టెస్ట్ ఈవెంట్లోనూ భారత పురుషుల సెపక్ తక్రా జట్టు గోల్డ్ మెడల్  సాధించి దేశానికి గౌరవం తెచ్చింది. ఈ విజయంపై సౌత్ ఏషియా సెపక్ తక్రా ఆర్గనైజే షన్ అధ్యక్షుడు ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్, సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉమ్మడి కార్యదర్శి పెరిక సురేష్, జనరల్ సెక్రటరీ నరేష్ కుమార్ లు ఆటగాళ్లు, కోచ్లు, మేనేజ్మెంట్, ఫెడరేషన్ సభ్యులకు  అభినందనలు తెలిపారు.