ఈదురు గాలులతో రోడ్డుపై పడిన చెట్టు తొలగించిన సర్పంచ్
బెజ్జంకి: బెజ్జంకి మండలం వీరపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ వైర్లపై ఉన్న చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో గ్రామంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్ వెంటనే స్పందించి స్థానిక యువకులు, గ్రామస్తుల సహకారంతో రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించి మార్గాన్ని పూర్తిగా శుభ్రం చేయించారు. దీంతో రాకపోకలు యథావిధిగా పునరుద్ధరించబడ్డాయి. ఈ సందర్భంగా సర్పంచ్ చిలుముల సతీష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ఈదురు గాలులు, భారీ వర్షాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ వైర్లు లేదా చెట్లు ప్రమాదకరంగా కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.






